हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Handicapped : దివ్యాంగులకు సమాన హక్కులవసరం

Sudha
Handicapped : దివ్యాంగులకు సమాన హక్కులవసరం

మన సమాజంలో దివ్యాంగ వ్యక్తుల జీవితం ఇంకా నిరంతర పోరాటంగానే కొనసాగుతోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి న్యాయస్థానాలు వరకు దివ్యాంగుడు అడుగుపెట్టిన ప్రతి చోటా అతడిని తక్కువ చూపుతో చూడటం, అనుమానంతో వ్యవహరించడం ఒక వ్యవస్థాగత వివక్షగా మారింది. దివ్యాంగుడిని మాటలతో దూషించడం, శారీరక లోపాన్ని ఎగతాళి చేయడం, అవమానించడం మానవత్వానికి విరుద్ధమే కాకుండా చట్టపరంగా శిక్షార్హమైన నేరమని చాలా మందికి ఇంకా తెలియదు. భారతదేశ పార్లమెంట్ 2016లో తీసుకొచ్చిన వికలాంగుల (Handicapped)హక్కుల చట్టం దివ్యాంగులను దయతో చూడాల్సిన వర్గంగా కాకుండా సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించింది. ఈ చట్టం ప్రకారం వికలాంగులపై ఏ రూపంలో వివక్ష చూపినా, వారి గౌరవాన్ని భంగపరిచినా, వారి హక్కులను అడ్డుకున్నా శిక్షలు తప్ప వని స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ వాస్తవంగా చూస్తే గ్రామాలు, కార్యాలయాల్లో ఈ చట్టానికి భయపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగ ఉద్యోగులు లేదా సేవల కోసం వచ్చిన దివ్యాంగ పౌరులు ఎదుర్కొనే పరిస్థితి మరింత బాధాకరం. దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, ఫైళ్లను పక్కన పెట్టడం, పదే పదే తిరగమంటూ మానసికంగా వేధించడం ఈ చట్టం ప్రకారం నేరాలే అయినా, వాటిపై చర్యలు అరుదుగా కనిపిస్తున్నాయి. వికలాంగ ఉద్యోగిని అతడి లోపాన్ని చూపిస్తూ అవమానించడం, పనిభారం పేరుతో వేధించడం, ప్రమోషన్లు లేదా బదిలీల్లో వివక్ష చూపడం కూడా చట్టవిరు ద్ధమే. అలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారులపై క్రమ శిక్షణ చర్యలు, జరిమానాలు, అవసరమైతే జైలుశిక్షలు విధిం చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Read Also: Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

Handicapped
Handicapped

దివ్యాంగుల ఆస్తుల విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆందోళనకరం. దివ్యాంగు డని తెలిసినా అతడి భూమిని అక్రమంగా ఆక్రమించడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడం తరచుగా జరుగుతోంది. వికలాంగుల ఆస్తులపై దురాక్రమణ జరిగితే ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, వేగంగా పోలీస్ కేసులు నమో దు చేసి బాధితుడికి న్యాయం అందించాలని 2016 చట్టం స్పష్టం చేస్తోంది. దివ్యాంగుడి భూమిని ఆక్రమించిన వారిపై జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అధికారం ఈ చట్టం ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా గ్రామస్థాయిలో ఈ శిక్షలు అమలవుతున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. దివ్యాంగులు ఫిర్యాదు చేస్తే వారినే ప్రశ్నించడం, రాజీకి ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధమే కాకుండా మరో రకమైన మానసిక వేధింపుగా మారుతోంది. దివ్యాంగుల హక్కులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా, రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంతవరకు చురుకుగా పనిచేస్తోంది అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. చట్టం ప్రకారం వికలాంగులపై జరిగే ప్రతి వివక్ష నేరమే అది వ్యక్తి చేసినా, ప్రభుత్వ ఉద్యోగి చేసినా, సంస్థ చేసినా శిక్ష తప్పదు. అయినా సమాజంలో ఆ భయం ఇంకా ఏర్పడలేదు. దివ్యాంగుల (Handicapped) హక్కులు సంక్షేమంగా కాకుండా మౌలిక హక్కులుగా చూడాలని చట్టం స్పష్టం చేసినా, అమలులో మాత్రం ఇంకా దయా దృష్టికోణమే కొనసాగు తోంది. దివ్యాంగుడిని సహాయం కోరే వ్యక్తిగా కాకుండా హక్కులు కోరే పౌరుడిగా గుర్తించినప్పుడే చట్టం జీవం పోసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ అధికా రులు, పోలీస్ యంత్రాంగం ఈ చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కలిగిఉండటం అత్యవసరం. దివ్యాంగులపై జరిగే ప్రతి వేధింపుకు స్పష్ట మైన శిక్షలు అమలైతేనే సమాజంలో మార్పువస్తుంది. చట్టాలు ఉన్నాయనే గర్వం సరిపోదు అవి బాధితుల జీవితాల్లో కనిపించాలి. దివ్యాంగులపై వివక్ష చూపిన ప్రతి వ్యక్తి శిక్షకు గురయ్యే రోజు వచ్చినప్పుడే సమానత్వం నిజమవుతుంది.
-తరిగోపుల నారాయణస్వామి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870