AP Cricket: క్రికెట్ బాగా ఆడే యువతకు ఉత్సాహాన్నిచ్చే శుభవార్త అందుతోంది. ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు, శిక్షణ లభించక వెనుకబడుతున్న యువకుల కోసం Andhra Cricket Association (ACA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్లో ప్రతిభ చూపుతున్న యువతీ యువకులకు ఫ్రీగా క్రికెట్ ట్రైనింగ్ అందించే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు ACA సిద్ధమవుతోంది.
Read Also: Kulavardhan Death: శవాన్ని కూడా కన్నతల్లి వద్దంది! మదనపల్లె నిందితుడి దుస్థితి
20-50 మందికి అవకాశం
ఈ ప్రోగ్రామ్‌ను ఏప్రిల్ 5న అధికారికంగా లాంచ్ చేసే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.19 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు ప్రిఫరెన్స్ ఉంటుందని, 19+ వారిని నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 88 నియోజకవర్గాల్లో ఒక్కో దాని నుంచి 20-50 మందికి అవకాశం కల్పించనున్నట్లు ACA వర్గాలు చెబుతున్నాయి.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారిని ప్రోత్సహించనున్నారు. క్రికెట్‌ను తమ కెరీర్‌గా ఎంచుకునేవారికి కూడా ప్రోత్సాహం అందిస్తారు.. అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించేలా ప్లాన్ చేశారు.

ఏసీఏ సెలక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి మూడు జోన్లలో నియోజకవర్గానికి రెండు నుంచి మూడుచోట్లు ఎంపికలు చేపడతారు.ఈ ఎంపికలకు సంబంధించి ముందే సమాచారం అందిస్తారు.. ప్రచారం కూడా చేస్తారు. బ్యాట్స్‌మెన్, స్పిన్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్, ఆల్‌రౌండర్, వికెట్ కీపర్స్‌ను ఎంపిక చేస్తారు. ఏసీఏ ఎంపిక చేసిన వారిని టాలెంట్ ఆధారంగా అకాడమీలు, ఫెసిలిటేటింగ్ సెంటర్లలో శిక్షణ అందిస్తారు.
అంతేకాదు వీరికి అవసరాన్ని బట్టి ఉచిత వసతి, రవాణా భత్యం కూడా ఉంటుంది. వీరిని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్లు కూడా ఆడిస్తారు. ఒకవేళ ప్రతిభ, నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఎక్కువ మంది ఉంటే.. ఉచితంగా క్రీడా పరికరాలు అందించి.. అక్కడే ఓ కోచ్‌ను నియమించి, ప్రాక్టీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఏపీలో క్రికెట్లర్లుగా రాణించాలనుకునేవారికి ఏసీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: