Srinagar Crime: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో శుక్రవారం ఉదయం ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేయడంతో, అక్కడ ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
Read Also: Kiren Rijiju : రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: