Bollywood Actor: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సునీల్ మల్హోత్ర అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. సిద్ధార్థ్ మల్హోత్ర పితృ వియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. అటు కియారా అద్వానీ (Kiara Advani) కూడా తన మామగారు పరమపదించడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ మల్హోత్ర ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Read Also: kidnapp Case- Mohan Babu: కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ప్రగాఢ సానుభూతి
తన తండ్రి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ గురించి, అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. స్ట్రోక్ కారణంగా వీల్‌ఛైర్‌కు పరిమితమైనా భయపడలేదని, నిద్రలోనే తుదిశ్వాస విడిచారని తెలిపారు. సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తండ్రి సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీలో కెప్టెన్ గా పనిచేశారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఇటు బాలీవుడ్ ప్రముఖులు , అభిమానులు సిద్ధార్థ్, కియారా అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ , షేర్ చేసిన ఫోటోలు అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: