Rajya Sabha Elections 2026: దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా పది రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు.
Read Also: Rajya Sabha Elections: మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు
తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల, మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు, మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: