Maharashtra: దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత నెల 28న జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన అకస్మిక మరణం పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా, ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సతీమణి, డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను లిసిన సునేత్రా..ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తి అందజేశారు.
Read Also: Ahmedabad-Gorakhpur Express : దారుణానికి ఒడిగట్టిన TTE ..ప్రయాణికురాలిపై అత్యాచారం

సీబీఐ విచారణ
సీబీఐ దర్యాప్తు రిక్వెస్ట్‌ను అంగీకరించిన ఫడ్నవీస్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను స్వయంగా వివరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సునేత్రా పవార్ నేతృత్వంలోని పలువురు ఎన్సీపీ నాయకులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి.. జనవరి 28న బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.. దీనికి స్పందించిన సీఎం.. కేంద్ర హోం మంత్రికి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందని హామీ ఇచ్చారు’’ అని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: