అహ్మదాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై టీటీఈ (TTE) అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రక్షణ కల్పించాల్సిన రైల్వే అధికారియే భక్షకుడిగా మారిన ఘటన అహ్మదాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఎన్సీసీ (NCC) క్యాడెట్ పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న ఒక యువతి, రైలులో విపరీతమైన రద్దీ ఉండటంతో సాధారణ టికెట్ తీసుకోకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశించింది. రైలులో టికెట్లు తనిఖీ చేస్తున్న టీటీఈ రాహుల్, ఆమె పరిస్థితిని గమనించాడు. జనరల్ టికెట్ లేదని భయపెట్టకుండా, ఆమెకు సీటు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తన క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.
Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్
నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. రైలు డియోరియా స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులకు పట్టుబడతాననే భయంతో నిందితుడు రాహుల్ అక్కడికక్కడే రైలు దిగి పరారయ్యాడు. పోలీసులు రైలు వద్దకు చేరుకునేలోపే నిందితుడు తప్పించుకోవడంతో, బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై ఇలాంటి దారుణాలు రైళ్లలో కూడా జరుగుతుండటం ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం రైల్వే పోలీసులు నిందితుడైన టీటీఈ రాహుల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచానికి పాల్పడటంపై రైల్వే శాఖ సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రైల్వే వ్యవస్థలో మహిళల భద్రత కోసం మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
.