టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, గాయని మమతా మోహన్‌దాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని జయించి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఆమె, ఇప్పుడు తన వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో నాగార్జున సరసన ‘కేడి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మమతా మోహన్‌దాస్, తన జీవితంలో రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, తన మాజీ భర్త, వ్యాపారవేత్త ప్రేజిత్‌తో విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 2011లో వీరిద్దరికీ వివాహం జరగగా, మనస్పర్థల కారణంగా ఏడాది లోపే విడిపోయారు. అయితే, ఇటీవల ఒక వివాహ వేడుకలో ప్రేజిత్‌ను మళ్ళీ కలిశానని, ఆ సమయంలో ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉన్నట్లు అనిపించిందని ఆమె తెలిపారు. ఆ సమయంలోనే ప్రేజిత్ మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చారని, “మనం మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?” అని అడిగినట్లు ఆమె వెల్లడించారు.
Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్
ఈ ప్రతిపాదనపై మమతా సానుకూలంగా స్పందిస్తూ, ఆ విషయాన్ని తన తండ్రితో మాట్లాడమని ప్రేజిత్‌కు సూచించినట్లు చెప్పారు. సరైన వ్యక్తి దొరికితే మళ్ళీ ప్రేమలో పడటానికి, సంసార జీవితాన్ని ప్రారంభించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధితో పోరాడి, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మమతా, ఇప్పుడు ఎంతో పరిణతితో తన నిర్ణయాన్ని వెల్లడించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆమె తన పెళ్లికి సంబంధించి అధికారికంగా శుభవార్త చెబుతారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంతో పాటు పలు భాషల్లో సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com