Secret camera incident : బెంగళూరులో ఓ కన్నడ టీవీ నటి తీవ్రమైన వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సెలబ్రిటీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా స్టేడియం వాష్‌రూమ్‌లో ఆమెను రహస్యంగా వీడియో తీసిన వ్యక్తి, ఆ వీడియోలతో డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిబ్రవరి 7న కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కొద్ది రోజుల తర్వాత నిందితుడు వీడియోలను ఆమె స్నేహితురాలి ఇన్‌స్టాగ్రామ్‌కు పంపి, డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం, వాయిరిజం, బెదిరింపులు, ఎక్స్టార్షన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో మహిళా కళాకారుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: