Karnataka: సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు సామాన్లు మర్చిపోవడం, ఫోన్లు వదిలేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక కుటుంబం ఏకంగా తమ 4 ఏళ్ల చిన్నారినే క్యాబ్‌లో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు హెన్నూర్ ప్రాంతంలో జరిగింది.
Read Also: AI Summit : పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
శనివారం రాత్రి పొన్నప్ప లేఅవుట్లోని తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు ఒక కుటుంబం క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణంలో అలసిపోయిన 4 ఏళ్ల చిన్నారి కారు వెనుక సీట్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అపార్ట్మెంట్ చేరుకున్నాక.. కుటుంబ సభ్యులందరూ బాబు దిగాడనే భ్రమలో సామాన్లతో సహా దిగిపోయారు. డ్రైవర్ కూడా వెనుక సీటును గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న కాసేపటికి బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు.

పోలీసులకు కృతజ్ఞతలు
ఇల్లంతా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో.. తాము క్యాబ్‌లోనే బాబును వదిలేశామని గ్రహించి లబోదిబోమన్నారు. వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ ‘నమ్మ 112’కు కాల్ చేసి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నాలజీ సహాయంతో ఆ క్యాబ్ నంబర్, డ్రైవర్ వివరాలను ట్రాక్ చేశారు. వెంటనే డ్రైవర్‌కు ఫోన్ చేసి.. కారు వెనుక సీట్లో పిల్లాడు నిద్ర పోతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అప్పటి వరకు తన కారులో ఒక చిన్నారి ఉన్నాడన్న విషయం డ్రైవర్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. వెంటనే కారును వెనక్కి తిప్పాలని డ్రైవర్‌ను ఆదేశించిన పోలీసులు.. అపార్ట్మెంట్ వద్దకు పిల్లాడిని సురక్షితంగా తీసుకువచ్చేలా చూశారు. గంట తర్వాత తమ కళ్లముందే బాబును చూసిన తల్లిదండ్రులు ఆనందబాష్పాలతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: