Cigarette Price: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్ ఈ నెల నుంచి సిగరేట్ల బ్రాండ్ల ధరలు పెరిగాయి. ప్రధాన మంత్రి మోడీ సర్కార్ (Minister Modi) ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత సిగరెట్ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ, సుంకాలను కేంద్రం భారీగా పెంచింది. పొగాకు ఉత్పత్తులపై సెస్‌లను పెంచడం వల్ల ధరలు పెరిగాయి. సిగరెట్ పొడవు, ఫిల్టర్‌ను బట్టి బడ్జెట్ పన్ను శ్లాబులను పొగాకు ఉత్పత్తులపై సవరించారు. ఇక వాటిపై సెస్ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారం పెరిగింది. దీంతో కంపెనీలు ఈ అదనపు ఖర్చులను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో రూ.10 విలువ చేసే సిగరెట్ రూ.13కి పెరిగింది. ఈ క్రమంలో సిగరెట్ అలవాటు ఉన్నవారికి బడ్జెట్ పెరగనుంది. ఏయే సిగరెట్ ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
Read Also: NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

ధరలు ఎంత ?
గోల్డ్ ఫ్లేక్ కింగ్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర 70 రూపాయలు పెరిగి 240కి చేరింది. క్లాసిక్ రెగ్యులర్, మైల్డ్, ఆల్ట్రా సిగరెట్ల ధరలు 140 రూపాయలు పెరిగి 480కి చేరాయి. క్లాసిక్ కనెక్ట్ 60 రూపాయలు పెరిగి 360కి చేరగా, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ 11 రూపాయలు పెరిగి 70కి చేరింది. మొత్తం మీద ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. ధరల పెంపుతో సిగరెట్ల కొరత ఏర్పడింది. సిగరెట్ ప్రియులు తక్కువ ధర సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: