हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Rayachoti: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Saritha
Rayachoti: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

కోటిన్నర సొమ్ము స్వాధీనం

రాయచోటి: Rayachoti: జాతీయ రహదారిలో ఒంటరి డ్రైవింగ్ చేసే వాళ్లే లక్ష్యంగా ఎక్కడో మహారాష్ట్రకు (Maharashtra) చెందిన దొంగల ముఠా ఫైనాన్స్ కంపెనీని పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని రాయచోటి నియోజకవర్గ పరిధిలోని రామాపురం పోలీసులు ఆటకట్టించారు. ఒంటరిగా వాహనాలలో వచ్చే వారిని ముందుగా మేము పెయిన్స్ కంపెనీ వాళ్ళము అని చెప్పి అనేక రకాలుగా బయబ్రంతకు గురిచేసి డబ్బులను వసూలు చేసి మోసానికి తెర లేపారు. రామాపురం పోలీసులు ఆ మోసానికి సమాప్తం పలికే విధంగా అడుగులు వేశారు. ఎట్టకేలకు మహారాష్ట్ర మోసాల ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురిని ఆరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.1,50,00,000 విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాయచోటిలోని డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ కృష్ణమోహన్ సంబంధిత వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.

Read Also: Nellore Tragedy: అలల ఉధృతికి ఇద్దరు యువకులు జలసమాధి

Rayachoti: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Rayachoti: Interstate robbery gang arrested

వివరాలు వెల్లడించిన డిఎస్పి కృష్ణమోహన్

ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ మోహన్ తెలియజేసిన వివరాలు… రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ నెల 14 వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డి.ఎస్.పి కృషమోహన్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రామాపురం సమీపంలోని జాతీయ రహదారిలో మహారాష్ట్రకు చెందిన లారీ (ట్రక్) డ్రైవర్ షేక్ ఇర్ఫాన్ను కొందరు వ్యక్తులు ఆపి ఈఎంఐ బకాయిలు పెండింగ్ ఉన్నాయని, మేము ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం అని మోసపూరిత మాటలు చెప్పి లారీ (ట్రక్) వాహనాన్ని స్వాధీనం చేసుకొని దొంగిలించారు. చేసేది ఏమి లేక ఇర్ఫాన్ రామాపురం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణం రాజునాయక్, జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, రామాపురం ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో చిట్లూరు పంచాయతీ గంగమ్మ గుడి మజ్జిగవాండ్ల పల్లి, గంగమ్మ గుడి రోడ్డులో నిందితుల ఆచూకీ కనుక్కుని అక్కడికి వెళ్ళారు.

పట్టుకునే ప్రయత్నంలో పరారు

గుర్తించి పట్టుకునే ప్రయత్నంలో వారు పారిపోయారు. పోలీసులు వెంబడించి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజుత్ర మల్లారి షిండే, నిసార్ రఫిక్ షేక్, లక్ష్మణ్ దిగంబర, సూరజ్ రమేష్ ఔరదేలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి ఒక లారీ (ట్రక్), 33 లోహపు ముద్దలు, స్కార్పియో వాహనం, ఒక కొరడా, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము నిందితులను విలువ సుమారు రూ. 1,50,00,000 ఉంటుందని డీఎస్పీ కృష్ణ మోహన్ తెలియజేశారు. అదేవిధంగా ఇలాంటి దొంగతనాలు వారు అనేకం చేశార అని నిందితులు ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణం రాజునాయక్, చంద్రశేఖర్, ఎస్ఐఐ శివకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870