हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hyderabad Municipal Corporations: ఓవైపు ఖాళీలు.. మరోవైపు పనిభారం

Tejaswini Y
Hyderabad Municipal Corporations: ఓవైపు ఖాళీలు.. మరోవైపు పనిభారం

Hyderabad Municipal Corporations : విభజన ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీ నుం చి కీలక అధికారులను, సిబ్బందిని కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు బదిలీ చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 303 మంది అధికారులు, సిబ్బంది, మల్కాజిగిరికి 300 మంది అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. అడ్డగోలుగా జరిగిన ఈ బదిలీలు సేవలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అవగాహన లేని వారికి కొత్త బాధ్యతలు, సంబంధం లేని విభాగాలకు సిబ్బందిని నియమించడం ద్వా రా పౌరుల ఇబ్బందులు అధికమయ్యాయి. అలాగే జీహెచ్ఎంసీలోని ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ విభాగాలకు అదనపు కమిషనర్ గా వ్యవహారిస్తున్న అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోన్ కు జోనల్ కమిషనర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

Hyderabad Municipal Corporations: Vacancies on one side.. and workload on the other
Hyderabad Municipal Corporations: Vacancies on one side.. and workload on the other

ప్రస్తుతం సైబరాబాద్ జోనల్(Cyberabad Zonal) కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక లకు హెల్త్ విభాగం అదనపు కమిషనర్ గా, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటు శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ గా బాద్యతలు స్వీకరించిన చంద్రకళకి ఎలక్షన్ వింగ్ అదనపు బాధ్యతలను అదనంగా అప్పగించారు. జీహెచ్ఎంసీలోని ఆర్చ అర్బన్ కమ్యూ నిటీ డెవలప్మెంట్ (యూసీడీ) వింగ్ కు అదన పు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్ పంకజను సర్కారు జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా నియమించటంతో ఆమె బాధ్యతలను అదనపు కమిషనర్ మంగతాయారకు అప్పగించా రు. కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న సత్య నారాయణకు అదనంగా అదనపు కమిషనర్ అడ్మిన్ బాధ్యతలను అప్పగించారు. ఇక ఇంజనీ రింగ్ విభాగంలో ప్రాజెక్ట్ కి వేరుగా చీఫ్ ఇంజనీర్ (సీఈ), మెయింటెనెన్స్ కి వరుగా సీఈ ఉం డేది. ఇప్పుడు విభజన తరువాత మూడు కార్పొరేషన్లకి ఈ రెండింటిని కలిపి ఒక సీఈనే నియమించారు.

జిహెచ్ఎంసిలో ఖాళీలు..

సిఎంఎస్, ఎంఎంఎస్కు ఉద్యోగులు బదిలీ కావ డంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పలు విభాగాలు ఖాళీ అయ్యాయి. పాత సిబ్బం ది వెళ్లిపోవడం, కొత్త వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఫైళ్లు ఎకడిక నిలిచిపోవడం సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగి స్తున్నది. ఒకే అధికారికి రెండు మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో వారు పనిభారంతో సత మతమవుతున్నారు. మొత్తంగా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ హడావుడి నిర్ణయాల వల్ల అభివృద్ధి పనులు మందగించడమే కా కుండా, ప్రజలకు అందాల్సిన కనీస సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కేవలం పైస్థాయి లోనే కాదు, అన్ని విభాగాల్లోనూ పరిస్థితి ఏర్ప డింది. అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులను కుదించారు.

జీహెచ్ఎంసీలో ఖాళీ అయిన పలు విభాగాలకు అదనపు కమిషనర్లను నియమించేం దుకు అధికారులు లేకపోవటంతో పలువురు జోనల్ కమిషనర్లకు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలకు అదనపు కమిషనర్లుగా బాధ్య తలను అప్పగించారు. కొందరు అదనపు కమిష నర్లు, జోనల్ కమిషనర్లకు రెండు నుంచి మూ డు విభాగాల బాధ్యతలను అప్పగించటంతో అ ధికారులు పని ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపి స్తుంది. అదనపు విధుల నిర్వహణ కారణంగా ఆఫీసర్లు ఎపుడు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ విభాగంలో ఎస్టేట్స్ విభాగాన్ని విలీనం చేయడంతో, ఆస్తుల రక్షణ, పన్నుల వసూళ్లపై పట్టు తగ్గుతోందనే విమర్శలు వినిపి స్తున్నాయి. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శానిటేషన్, హెల్త్, ఎలక్షన్స్, యూసీడీ వంటి కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఉన్నవారికే వీటిని అదనపు బాధ్యతలుగా అప్ప గించారు. అదనపు బాధ్యతలు అప్పగించడంపై కొందరు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870