బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశమే అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నా తర్వాత వచ్చిన పరిణామాలు, పాలకులు, వారి వారి విధానాల కారణంగా ఆ రెండు దేశాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. బంగ్లా జాతిపితగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం బంగ్లాదేశ్కు భారత్కు మధ్యదూరం పెరిగి పోయింది. ఏమాత్రం సఖ్యత లేనేలేదు. షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చామనో, మరెందు చేతనో అక్కడి తాత్కాలిక పాలకుడు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ భారత్ మీద నిప్పులు కక్కుతున్నారు. ఇటీవల జరిగిన బంగ్లా అల్లర్లలో ముగ్గురు హిందువులను వేర్వేరు సందర్భాల్లో ఉద్యమకారులు చంపేస్తున్నా పాలకులు చోద్యంచూశారు. బంగ్లాదేశ్లో హిందువులకెలాంటి రక్షణ ఉందో ఆయా సంఘటనలే చెబుతున్నాయి. హసీనా హయాంలో భారత్తో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే ఆమెకు భారత్లో ఆశ్రయం దొరికింది. ఇది కూడా తాత్కాలిక పాలకులకు భారత్ మీద కన్నెర్ర చేసేందుకు కారణమై ఉండవచ్చు. తాజాగా హసీనా పార్టీకి పోటీ చేసే అర్హతను లేకుండాచేసి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిపించా రు అక్కడి తాత్కాలిక అధ్యక్షుడు. నిన్నటి ఓట్ల లెక్కింపులో హసీనాతో ఎలాంటి సత్సంబంధాలు లేని బంగ్లా దేశ్ నేషనలిస్ట్ పార్టీ కూవా కొనసాగుతోంది. ఈసార్వత్రిక ఎన్నికలో బిఎన్పి అత్యధిక స్థానాలు గెలుచుకోగా, షఫీ కర్ రెహమాన్ సారధ్యంలోని జమాత్ ఇస్లామీ కూటమి గెలుచుకున్న స్థానాలు తక్కువే అయినా రెండో స్థానంలో ఉంది. దాదాపు 37 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ను (Bangladesh)మహిళలే పాలించారు. తర్వాత తొలిసారి బిఎన్పి చైర్మన్ తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్ అధికార పీఠమెక్కనున్నారు. జమాత్ ఇస్లామీ కూటమిలో దాదాపు 11 పార్టీలు భాగస్వాములు గా ఉన్నాయి. అయినా ప్రజా బాహుళ్యం బిఎన్పివైపే మొగ్గు చూపింది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు జనం ఎంతగానో ఆసక్తి చూపారని పాల్గొన ఓటర్ల సంఖ్యే చెబుతోంది. ఎందుకంటే హసీనా ప్రభుత్వం పై ఒక్కసారిగా జనం తిరగబడ్డారు. హసీనా తీసుకున్న అనేక నిర్ణయాలు వారికి రుచించలేదు. నిరుద్యోగ సమస్య అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలు హసీనా ప్రభుత్వాన్ని కుదిపేసాయి. ఇండియా ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయింది. పాలకులు వాటిని అదుపు చేయలేకపోయారు. అవామీలీగ్వంటి కొన్ని పార్టీలు ప్రాతినిధ్యం పోటీ చేసే అర్హతలను నిషేధించే ఈఎన్నికలు ప్రజాస్వామ యుత ఎన్నికలు అయినా కాకపోయినా జనం బిఎన్పికి పట్టం కట్టారు. కనుక వారి తీర్పును శిరసావహించా ల్సిందే. ఇక్కడ విశేషమేమిటంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ రాజ్యాంగ సంస్కరణలు కోరే 84 ప్రతిపాద నాంశాలతో రెఫరెండం కూడా జతచేశారు. చాలా ముస్లిం దేశాలలో రెఫరెండం వంటి అంశాలు సర్వసాధారణం. ఈ రెఫరెండం పేరు జూలై నేషనల్ చార్టర్. మాజీ మహిళా ప్రధాన మంత్రి దివంగత ఖలీదా జియా పార్టీ 15ఏళ్ల తర్వాత ఆమె వారసుని నేతృత్వంలో బంగ్లాదేశ్ (Bangladesh) గద్దెనెక్కుతోందన్న మాట. మొన్నీమధ్యనే ఆమె దివంగతురాలైంది. కనుక ఆమె కుమారుడు తారీఖ్ రహ్మాన్ చేతికే పగ్గాలు లభిస్తాయి. ఒకనాడు దేశ బహిష్కరణకు గురై 15 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే తారీఖ్ బంగ్లాదేశ్కు తిరిగొచ్చారు. అవినీతి ఆరోపణలపై 17 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ఐనా ప్రజల్లో వచ్చిన మార్పుతో ఆయనకు ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. 2002-2006లో ఖలీదా అధికారంలో ఉన్నప్పుడు ఇండియాకు వ్యతిరేకం గా వ్యవహరించేవారు. జలజగడాలుండేవి. వాణిజ్యపర మైన ఒప్పందాలు బెడిసి కొట్టాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు ఉంది. అయితే తారీఖ్ రహ్మాన్ ‘సమ్మిళిత బంగ్లాదేశ్ అనే నినాదం ఎత్తుకున్నారు. ఎన్నికల ప్రచారం లో కూడాఎలాంటి భారత్ వ్యతిరేక ప్రస్తావనలు తేలేదు. ఈ నేపథ్యంలో ఇండియా పాలకులలో విబేధించే పరిస్థితి రాకపోవచ్చు. బంగ్లాదేశ్లో హిందువుల భద్రత మనకు ముఖ్యం. కాగా, భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించమనే అభ్యర్థి నను తీవ్రతరం చేయవచ్చు. కాగా ఇలాంటి ఆ దేశ అంశాలతో భారత్ కూడా గట్టిపట్టు పట్టకపోవచ్చు. తారీఖ్ ఘన విజయాన్ని భారత ప్రధాని మోడీ స్వాగతించారు. ఆయనకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రగతి శీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. ఇవన్నీ భారత్ బంగ్లాదేశ్ల మధ్య స్నేహ సౌహర్ద్రతను పెంచే అంశాలే. బంగ్లాదేశ్కు, తారీఖ్ తొలి పురుష ప్రధాని యువత బిఎన్పికి పట్టుగా నిల బడింది. వృద్ధుల్ని సైతం ‘బంగ్లా ఫస్ట్’ అనే నినాదంతో ఆకట్టుకోవడం విశేషం. బంగ్లాదేశ్ ఈ మధ్యకాలంలో పాకిస్థాన్కు అనుకూలవైఖరి అవలం బిస్తూ భారత్ మీద వైషమ్య వ్యాఖ్యలకు అవకాశమిచ్చిం ది. ఈ నేపథ్యంలోనే అక్కడ హిందూ వ్యతిరేక వైఖరి బలపడింది. ఇలాంటి పరిస్థితులను క్రోడీకరించుకుని బంగ్లాదేశ్ను ప్రగతిబాటలో నడిపించే బాధ్యత తారిఖ్ భుజస్కంధాల మీద పడింది. భారత్ వ్యతిరేక జమాతే పార్టీ ఓటమి చెందినందున భారత్తో చెలిమికి బంగ్లా దేశ్కు ఏమాత్రం అడ్డంకి ఉండబోదు. రెఫరెండానికి 60.25శాతం ఓట్లుపడినందున దేశంలో అస్థిరతలేకుండా చేసి భారీగా ప్రజాస్వామిక సంస్కరణలు తేగలిగితే ఆయన నేతృత్వానికి సంపూర్ణ విజయం చేకూరినట్లే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: