हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన చంద్రబాబు

Saritha
AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన  చంద్రబాబు

AP: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు, సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ (NTR Trust) ప్రస్థానం కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో సీఎం పోస్ట్ చేశారు.

Read Also: TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన  చంద్రబాబు
AP: Chandrababu congratulates NTR’s trustee team

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు.

అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్ట్ సేవలను విస్తరిస్తూ అత్యంత సమర్థ సంస్థగా ముందుకెళ్తాంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఆమె బృందానికి అభినందనలు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870