हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Summer Telugu Movies 2026: వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!

Anusha
Summer Telugu Movies 2026: వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!

Summer Telugu Movies 2026: తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్‌గా సమ్మర్‌ను పరిగణిస్తారు. స్కూల్, కాలేజీలకు దీర్ఘకాల సెలవులు ఉండటం, కుటుంబాలతో, కలిసి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక సహజంగానే పెరుగుతుంది. ఒకప్పుడు ఈ వేసవి సీజన్ అంటే అగ్రహీరోల సినిమాల సందడి, భారీ ఓపెనింగ్స్, బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ అన్న మాట. ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందన్నదే పరిశ్రమలో హాట్ టాపిక్‌గా ఉండేది.

Read Also: Rebel Star: సినిమా షూటింగ్ లోగాయపడ్డ ప్రభాస్‌?

వేసవిని టార్గెట్ చేస్తూ సినిమాలు సిద్ధం

అయితే గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా ప్రాజెక్టులు, విడుదల తేదీల మార్పులు, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం వల్ల వేసవిలో సినిమాల హడావుడి కాస్త తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది చిన్నా, పెద్దా అనేక చిత్రాలు వేసవిని టార్గెట్ చేస్తూ సిద్ధమవుతుండటంతో సమ్మర్‌లో థియేటర్లు కళకళలాడనున్నాయి. మార్చి మొదటి వారంలోనే కొత్త సినిమాల జోరు మొదలు కాబోతుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సతీ లీలావతి’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Summer Telugu Movies 2026: These are the movies releasing in summer!
Summer Telugu Movies 2026: These are the movies releasing in summer!

అదే రోజున శివాజీ, లయ కీలక పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మార్చి 13న చిన్న చిత్రం ‘బ్యాండ్ మేళం’ ప్రేక్షకులను అలరించనుంది. ‘ధురంధర్ 2’ కూడా తెలుగులో విడుదల కానుంది.‘కేజీఎఫ్‌’తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా అదేరోజున విడుదలకు సిద్ధమవుతోంది.

‘స్వయంభు’ పై మంచి అంచనాలు ఉన్నాయి

పవర్‌స్టార్ పవన్ నటించిన తాజా చిత్రం ‘ ఉస్తాద్ భగత్‌సింగ్ ’ మార్చి 26న విడుదల కానుంది. ఏప్రిల్‌లో కూడా సినిమాల సందడి కొనసాగనుంది. శర్వానంద్ నటించిన ‘బైకర్’ ఏప్రిల్ 3న రానుంది.అదే రోజున సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ కూడా విడుదలవుతోంది. ఏప్రిల్ 10న నిఖిల్ సిద్ధార్థ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

అదే రోజున అడివి శేష్ ‘డెకాయిట్’ రిలీజ్ కానుంది.ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదల కానుంది.చిరంజీవి నటించిన ఫాంటసీ చిత్రం ‘ విశ్వంభర ’, అఖిల్ ‘లెనిన్’, సాయి దుర్గాతేజ్ ‘సంబరాల యేటి గట్టు’ వంటి చిత్రాలు విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ సినిమాల తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి, ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కనిపించేలా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870