మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలకమైన,నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో మహిళలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ వయసున్న బాలికలు రాష్ట్రంలో 4 .60 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వ్యాక్సినేషన్ చేపట్టడానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహించనున్నారు.
Read Also: Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?
సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు
దీని ద్వారా ఈ వయసున్న అమ్మాయిలు స్కూళ్లలో ఎంత మంది ఉన్నారు, బయట ఎంత మంది ఉన్నారనే వివరాలను సమగ్రంగా సేకరిస్తారు.తెలంగాణలోని క్యాన్సర్ కేసులను పరిశీలిస్తే.. మహిళల్లో ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలకు సోకే సర్వైకల్ క్యాన్సర్లలో 85 నుంచి 90 శాతం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్లే సోకుతోంది. ఎక్కువసార్లు ప్రసవాలు,

వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చిన్న వయసులోనే పెళ్లి కావడం, లైంగిక సంబంధాల వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత మహిళల్లో క్యాన్సర్ బయటపడుతుంది. దీంతో అమ్మాయిలు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత, లైంగిక జీవితాన్ని ప్రారంభించడానికి ముందు హెచ్‌పీవీ టీకాలు వేయిస్తే.. క్యాన్సర్‌ను అరికట్టడంలో మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: