Court bribery probe : మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉన్న కేసుకు అనుకూల తీర్పు వచ్చేలా చేస్తానంటూ న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని చెప్పి పిటిషనర్ల నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలు సీనియర్ న్యాయవాది మురళీకుమరన్పై వెలువడటంతో తమిళనాడు న్యాయవర్గాల్లో కలకలం రేగింది. ఈ విషయంపై “ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్” సంస్థ కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును న్యాయశాఖ మద్రాస్ హైకోర్టుకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
2008–09లో ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను సుమారు రూ.113.38 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ ప్రసాద్ అగర్వాల్, గణేశ్ అగర్వాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నిర్మల్ కుమార్ ఎదుట కొనసాగుతోంది.
Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?

ఈ కేసులో అనుకూల తీర్పు కోసం న్యాయమూర్తికి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ మురళీకుమరన్ పిటిషనర్ల నుంచి డబ్బులు వసూలు (Court bribery probe) చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తన దృష్టికి రావడంతో జస్టిస్ నిర్మల్ కుమార్ తీవ్రంగా స్పందించి కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, మురళీకుమరన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: