Jasprit Bumrah : కొలంబోలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.
మ్యాచ్ ఆరంభంలోనే భారత్‌కు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0) అవుట్ అయ్యాడు. అనంతరం రెండో ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా తన మాయాజాలాన్ని చూపించాడు. మొదటి బంతికి సిక్సర్ కొట్టిన సైమ్ అయూబ్ (6)ను వెంటనే అద్భుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (4)ను ఔట్ చేసి పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చాడు.
Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?

కేవలం రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: