(Tollywood) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మార్చి 6వ తేదీన నయనికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే అధికారికంగా పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. అల్లు అరవింద్ నివాసంలో అట్టహాసంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి కార్డులు పంచడం కూడా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

వైరల్
తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను కుటుంబ పెద్దలకు అందించడం ఆనవాయితీ. అదే విధంగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కొణిదెల దంపతులకు తొలి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య, అత్తయ్యలకు అందించాం” అని పేర్కొన్నారు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ వర్గాల్లో కూడా ఈ వివాహం గురించి చర్చ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: