
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కొత్త సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నాగబంధం’ పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ టీజర్‌ను విడువల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.”‘ది వరల్డ్ ఆఫ్ నాగబంధం’ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
Read Also: Thalapathy vijay: ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్టేనా!
‘నాగబంధం’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది
త్వరలో దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
టాలీవుడ్లో డివైన్ కాన్సెప్ట్ చిత్రాలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘నాగబంధం’ కూడా అదే తరహాలో కొత్త అనుభూతిని అందిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి స్పందన లభించగా, విజువల్ క్వాలిటీ హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆధ్యాత్మికతతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘నాగబంధం’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: