టీ20 క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) లో భాగంగా నేడు క్రికెట్లోనే అతిపెద్ద ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. వేల కోట్ల రూపాయల బిజినెస్‌ను తెచ్చిపెట్టే ఈ మ్యాచ్‌కి శ్రీలంలోకి కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
Read Also: ENG vs SCO T20 : స్కాట్లాండ్పై ఇంగ్లండ్ విజయం, బాంటన్ ఇన్నింగ్స్ గేమ్ మార్చింది!
ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తోంది
ఈ కీలక పోరుకు ముందు ఇరు జట్లలోని ఇద్దరు స్పిన్నర్లపైనే అందరి దృష్టి నెలకొంది. పాకిస్థాన్ సంచలనం ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ ఒకవైపు, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ఫామ్ మరోవైపు చర్చనీయాంశంగా మారాయి. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. బంతి వేసే ముందు అతడు తీసుకునే చిన్నపాటి విరామంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, అతడి యాక్షన్‌ను ఐసీసీ ఇప్పటికే రెండుసార్లు క్లియర్ చేసిందని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పష్టం చేశాడు.

ఈ వివాదంపై అనవసర రాద్ధాంతం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన అన్నాడు.మరోవైపు, భారత శిబిరంలో వరుణ్ చక్రవర్తి కీలక అస్త్రంగా మారాడు. ఈ టోర్నీలో అమెరికాపై 1 వికెట్, నమీబియాపై 3 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. 2024లో జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో,వరుణ్ పాకిస్థాన్‌కు పెను సవాల్ విసిరే అవకాశం ఉంది.ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సూపర్-8 దశకు మరింత చేరువ కావాలని చూస్తోంది. పాకిస్థాన్ కూడా అపజయం ఎరుగని జట్టు కావడంతో, ఈ పోరు హోరాహోరీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: