తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు, హంగ్ మున్సిపాలిటీల్లో వ్యూహాలు, ప్రతిపక్షాల పనితీరుపై ఆయన తన విశ్లేషణను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని భావించినప్పటికీ, తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ ఆశించినన్ని మున్సిపాలిటీలు గెలుచుకోలేదని, హంగ్ వచ్చిన చోట్ల కూడా తమకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత

(KTR) మున్సిపల్ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలు ఇవ్వలేదు అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. కరీంనగర్, నిజామాబాద్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం శూన్యమని కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికలపై మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: