
యూత్‌ను ఆకట్టుకునే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ‘ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో రోషన్ మేక ఇప్పుడు తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది (Emo Emo Idi Movie)’ అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ‘ద ఫస్ట్ బ్రీజ్’ (The First Breeze) పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు ‘హిట్’ సిరీస్, ‘సైంధవ్’ వంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లతో మెప్పించిన శైలేష్ కొలను, ఈసారి పూర్తి భిన్నంగా రొమాంటిక్ కామెడీ జానర్‌ను ఎంచుకోవడం విశేషం.
Read Also: Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత
2026 దసరా కానుకగా రిలీజ్?
ఈ సినిమాలో రోషన్ సరసన ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ (అపూర్వ పాత్రలో) కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ (Emo Emo Idi Movie) సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: