हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Telangana: ఈ నెల 15 నుంచి సోమశిల ఆలయ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

Anusha
Telangana: ఈ నెల 15 నుంచి సోమశిల ఆలయ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన సోమశిల ఆలయ క్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం, సప్త నదుల సంగమంగా పిలువబడే ఈ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ పర్యాటక కేంద్రంగా కూడా విశేష గుర్తింపు పొందింది. లలితా స్వామిశ్వర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

Read Also: Ibrahimpatnam: ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

ఆలయ కమిటీ చైర్మన్ బుక్క గోవింద రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తులు సప్తనది సంగమమైన పవిత్ర కృష్ణా నది లో పుణ్యా స్నానమాచరించి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఆదివారం రావడం అర్ధనారీశ్వరుడైన మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శివరాత్రి రోజు దంపతులచే రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, రాత్రికి ద్వాదశ జ్యోతిర్లింగముల, ఏక రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు.

Telangana: Brahmotsavams at Somashila temple from 15th of this month
Telangana: Brahmotsavams at Somashila temple from 15th of this month

కార్యక్రమాల వివరాలు

మూడు వైపులా నల్లమల కొండలు కనువిందు చేస్తుండగా కృష్ణా నదికి రెండు వైపులా ఇరుకైన కనుమల మధ్య నుంచి గలగల పారుతూ ప్రవహిస్తున్న జలాలు చూపర్లను పరవశింప చేస్తుంది.ఈ కేంద్రంలో 32 స్తంభాలు గల మహా మండపం 13 గుడులను కలిపి ఉన్నది. సోమేశ్వర స్వామి తో పాటు ఆష్ట లింగాలు గల ఆలయాలు ఉన్నాయి. సోమేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న ఆలయంలో లలితాంబికా దేవి కొలువై ఉన్నది. ఉత్సవాల సందర్భంగా కొల్లాపూర్ నుంచి సోమశిలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

ఆలయ కమిటీ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.కార్యక్రమాల వివరాలు.. ఈనెల 15వ తేదీ ఉదయం నుంచి సాయంకాలం వరకు దైవ దర్శనములు రాత్రి 9 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీ సోమవారం ఉదయం 9:15 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం, దేవుని ఊరేగింపు, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870