हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Jeevan reddy comments : జగిత్యాలలో కాంగ్రెస్ పతనానికి సంజయ్ కారణం, జీవన్ రెడ్డి

Sai Kiran
Jeevan reddy comments : జగిత్యాలలో కాంగ్రెస్ పతనానికి సంజయ్ కారణం, జీవన్ రెడ్డి

Jeevan reddy comments : జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కురు సామ్రాజ్య పతనానికి శకుని ఎలా కారణమయ్యాడో, అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమయ్యారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుస్తామనే అంచనాలు ఉన్నప్పటికీ, పార్టీ 20–22 స్థానాలకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలకు స్వేచ్ఛ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. జగిత్యాలలో పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు చైర్మన్ పదవులు ఇవ్వాలని, అవకాశవాదులకు అవకాశాలు ఇవ్వవద్దని సూచించారు.

Read Also: Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

Jeevan reddy comments
Jeevan reddy comments

రాయికల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మద్దతిచ్చిన అభ్యర్థులు 8 స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి మాత్రమే గెలిచారని, తమ వర్గం మద్దతిచ్చిన ముగ్గురిలో ఇద్దరు విజయం సాధించారని తెలిపారు. బీ-ఫారమ్ పంపిణీ, అభ్యర్థుల ఎంపికలో ఏర్పడిన సమస్యల వల్ల స్వతంత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్ రాని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా ప్రచారం చేయాల్సి వచ్చిందని, పార్టీ సూచించిన అభ్యర్థులకు ప్రచారం చేయలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ జెండా పట్టిన కార్యకర్తలను ఓడించేందుకు ఎమ్మెల్యే సంజయ్ ప్రచారం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ఆలోచన లేదని, స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870