ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. పసికూన జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ సందర్బంగా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇది జింబాబ్వే నుంచి వచ్చిన ఒక ‘స్టేట్మెంట్ విన్’ అని అభివర్ణించారు.
Read Also: T20 World Cup 2026: ఆసీస్‌పై జింబాబ్వే విజయం
“ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించాలంటే నిజమైన పట్టుదల కావాలి. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ తన పేరుకు తగ్గట్టే నాలుగు వికెట్లతో జట్టుకు వరంలా మారాడు. ఈ టోర్నమెంట్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది” అని సచిన్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.ఈ మ్యాచ్‌లో పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ (4 వికెట్లు), బ్రాడ్ ఎవాన్స్ (3 వికెట్లు) అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియాను జింబాబ్వే 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 23 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
అంతకుముందు, బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్ మరుమాని (35), ర్యాన్ బర్ల్ (35) కూడా కీలక పరుగులు చేశారు.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మాట్ రెన్షా (65) ఒంటరి పోరాటం చేశాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. జింబాబ్వే ఫీల్డింగ్‌పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసలు కురిపించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకి ఇది రెండో విజయం కావడం విశేషం. గతంలో 2007లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్‌పై జింబాబ్వే గెలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: