థియేటర్లలో విడుదలైన సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ (Raja Saab) ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినా, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తాజాగా జియో హాట్ స్టార్లో విడుదలైన ఈ సినిమా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
Read Also: Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్

సెన్సేషనల్ వ్యూస్
విడుదలైన మొదటి వారంలోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ వల్లే ఈ వ్యూస్ వచ్చాయని, ‘సలార్’ సినిమాకు కూడా ఇదే హాట్ స్టార్లో సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాలపై దృష్టి సారించారు. ‘ఫౌజీ’ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: