బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బీఎన్పీ ఛైర్మన్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిఖ్ రహమాన్(Tariq Rahman) ఢాకాలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఈ రోజు కోసం బంగ్లాదేశ్ ప్రజలు పదేళ్లుగా ఎదురచూశారని అన్నారు. ‘ఈ రోజు రాజ్యాంగబద్ధమైన నా ఓటు హక్కును వినియోగించుకున్నా. పదేళ్లకు పైగా బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసం ఎదురుచూశారు. గత రాత్రి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. అవి ఊహించనివి. పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలు కఠినంగా వ్యవహరిస్తాయని నమ్ముతున్నా. దేశవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, ఎలాంటి కుట్రనైనా తిప్పికొట్టవచ్చు’ అని రహమాన్ తెలిపారు.
Read Also: Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

మహిళా సాధికారిత ప్రధాన అంశం
బీఎన్పీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టి పెడతామని రహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారని, వారిని వెనక్కి వదిలేసి దేశం ముందుకు సాగలేదని అన్నారు. అందుకే తమ మేనిఫెస్ట్‌లో మహిళా సాధికారిత ప్రధాన అంశామని పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మొదటి రోజు నుంచి ఈ దిశగా పని చేయడం ప్రారంభిస్తామని రహమాన్ వివరించారు. పోలింగ్‌కు ముందు అందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇక గతంలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఎన్పీని నిషేధించారు. బీఎన్పీ ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జమాతే-ఎ-ఇస్లామీ పార్టీ అధినేత షఫీకుర్ రహమాన్ కూడా ఢాకాలోని మోనిపుర్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాన్ని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు యూనస్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: