(Andhra Pradesh) సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరిట జరిగిన వసూళ్ల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్టు పీటీ వారంట్ జారీ చేసింది. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. పోలీసులపై దౌర్జన్యం కేసులో బెయిల్ వచ్చినా, కొత్త వారంట్ రావడంతో ఆయన విడుదల కాలేదు. 2023లో పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి లాటరీ టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.
Read Also: Metro : ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?
పీటీ వారెంట్
ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితమే అంబటి రాంబాబుకు సంబంధించిన మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో అంబటి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పీటీ వారెంట్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు నిన్న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో గురువారం జైలు నుంచి అంబటి బయటకు వస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో మరో పిటి వారెంట్ జారీ కావడంతో ఈ కేసులో బెయిల్ మంజూరు అయ్యే వరకు జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: