हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Budget 2026: వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రోడ్ మ్యాప్

Rajitha
Budget 2026: వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రోడ్ మ్యాప్

కేంద్ర బడ్జెట్ పై చర్చలో వైసిపి ఎంపి మేడా రఘునాథరెడ్డి

రాజంపేట : దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోందని, దేశ ఆర్థిక వృద్ధి ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, యువ వ్యవస్థాపకులపై ఆధారపడి ఉందని అయితే బడ్జెట్లో వారి ఆశలు నెరవేరలేదని వైసిపి ఎంపీ మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ముఖ్య అంశాలను బడ్జెట్ పై చర్చలు మంగళవారం రాజ్యసభదృష్టికి తీసుకువచ్చారు. మధ్యతరగతికి పన్ను భారంలో ఉపశమనం లేదన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నప్పటికీ పన్ను స్లాబులు యథాతథంగా కొనసాగడం వల్ల ద్రవ్యోల్బణ ప్రభావంతో మధ్య తరగతి ప్రజలపై అదనపు భారముందని పేర్కొన్నారు.

Read also: AP Assembly Session : అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ?

Roadmap towards the goal of Developed India 2047

Roadmap towards the goal of Developed India 2047

సంవత్సరానికి సుమారు 15 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు గృహం, ఆరోగ్యం, విద్య ఖర్చులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. 30 శాతం గరిష్ట పన్ను రేటు తక్కువ ఆదాయ స్థాయిలోనే వర్తించడంతో పెట్టుబడులు, వినియోగం దెబ్బతింటున్నాయని, ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్టాండర్డ్ డిడక్షను పెంచకపోవడం కూడా నిరాశ కలిగించిందని విమర్శించారు. వ్యాపారాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోపం వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చాల్సిన సమయంలో దీర్ఘకాలిక పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక పథకం లేకపోవడం నిరుత్సాహకరమన్నారు. ప్రస్తుతం లక్షలాది పన్ను అప్పీలు పెండింగ్లో ఉండటంతో వ్యాపార మూలధనం నిలిచిపోతోందని తెలిపారు.

జీఎస్టీ రాయితీ సమానంగా అమలు చేయాలని డిమాండ్

జీఎస్టీ అమలులో కొంతమంది ఫీల్డ్ అధికారులు అనవసర నోటీసులు జారీ చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నారని తెలియజేశారు. నమ్మకపూరిత విధానం అవసరమన్నారు. అలాగే, వర్క్స్ కాంట్రాక్టుల్లో ఉపకాంట్రాక్టర్లకు జీఎస్టీ రాయితీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఎంఎస్ఎంఈలకు నష్టం జరుగుతోందని, జీఎస్టీ రిఫండ్లు సమయపాలనతో ఇవ్వాలని కోరారు. జనాభా లాభాన్ని ఉపయోగించుకునే విధానాలు అవసరం అన్నారు. దేశ జనాభాలో దాదాపు 65 మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారని, 2041 నాటికి యువభారత్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ ఉపాధి మాత్రమే ఏటా అవసరమైన దాదాపు కోటి ఉద్యోగాలను సృష్టించదు.

కాబట్టి, ముఖ్యంగా అధిక వృద్ధి చెందుతున్న రంగాలలో యువ వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడంపై విధానం దృష్టి పెట్టాలని సూచించారు. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టియర్-2, టియర్-3 నగరాల్లోనూ వ్యాపార అవకాశాలు పెంపొందించేలా క్రెడిట్ గ్యారంటీ, నియంత్రణ సడలింపులు అవసరమన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక ఎంట్రప్రెన్యూర్షిప్ డివిడెండ్ రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ 2026-27కు వైసిపి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870