ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్‌కు బెదిరింపు రావడంతో.. మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Also: Nellore Crime: భారీగా అక్రమ గుట్కా, పాన్ మసాలా స్వాధీనం

పోలీసుల దర్యాప్తు
తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి, ఎవరు పంపారు.. నేరుగా సచివాలయంలోని మంత్రి పేషీకి ఎలా చేరిందో ఆరా తీస్తున్నారు. అంతేకాదు సచివాలయంలోని సీసీ ఫుటేజ్, పోస్టల్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిని బెదిరిస్తూ లేఖ పంపారా?.. ఎవరైనా ఆకతాయిలు మంత్రిని బెదిరించడానికి ఇలా చేశారా అనే కాణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మంత్రి పేషీకి బెదిరింపులు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేవాలు కూడా ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి మంత్రికి బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: