బాపట్ల (Bapatla) జిల్లాలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే, ఆయన మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని నిస్సహాయ స్థితిలో ఓ కుమారుడు తన బైక్‌పైనే శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం పంచాయతీ రాళ్ల చెరువుకు చెందిన నక్కా నాగేశ్వరరావుకు గుండెనొప్పి వచ్చింది.
Read Also: Vijayawada: ఏపీ JAC చైర్మన్‌గా విద్యాసాగర్
కుటుంబసభ్యులు వెంటనే బైక్‌పై బాపట్ల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తరలించడానికి ఆస్పత్రి దగ్గర మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో లేవు.. ప్రైవేట్ వాహనాల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. అయితే రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు అవుతుంది.. అంత ఆర్థిక స్థోమత కూడా లేదు.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్
అందుకే బైక్‌పై నాగేశ్వరరావు మృతదేహాన్ని, కుమారుడు తన సోదరుడి సాయంతో 12 కి.మీ. దూరంలోని ఊరికి తీసుకెళ్లాడు. నాగేశ్వరరావు మృతదేహాన్ని బైక్‌పై ఊరికి తరలిస్తుండగా కొందరు స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఈ ఘటనపై స్పందించారు. వెంటనే సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అంతేకాదు మహాప్రస్థానం వాహనాన్ని బాపట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు కలెక్టర్. నక్కా నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితి గురించి తమకు చెబితే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసేవారిమని ఆస్పత్రిలో అధికారులు అంటున్నారు. నాగేశ్వరరావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: