हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

AP: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Anusha
AP: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

(AP) నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్సలర్‌, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై, విచారణ జరిగింది.ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం స్పష్టం చేసింది.విచారణ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన స్థానికంగా లేరని తెలిపారు.

Read Also: Actor Arjun: సినిమా ప్రీ రిలీజ్ లో సామాజిక కార్యకర్తలకు సన్మానం

తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా

కేవలం వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ కేసు పెట్టారని వాదించారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏపీపీ) సందీప్ ఈ వాదనలను వ్యతిరేకించారు. కిడ్నాప్ వ్యవహారంలో మోహన్‌బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఘటన సమయంలో ప్రధాన నిందితుడైన వర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్, మెసేజ్‌ల ద్వారా సంభాషించారని పేర్కొన్నారు.

AP: Mohan Babu faces hurdles in High Court in kidnapping case
AP: Mohan Babu faces hurdles in High Court in kidnapping case

ఇదే కేసులో A3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బాధితుడి వాదనలు కూడా విన్న తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేసు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870