हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Japan: ప్రేయసితో పెళ్లి కోసం న్యాయ పోరాటం చేసిన 97 ఏళ్ల వృద్ధుడు

Vanipushpa
Japan: ప్రేయసితో పెళ్లి కోసం న్యాయ పోరాటం చేసిన 97 ఏళ్ల వృద్ధుడు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. అది ఏ దశలోనైనా చిగురించవచ్చని చాలా మంది చెబుతుంటారు. సినిమాల్లోనూ చూపిస్తుంటారు. అక్కడక్కడా వార్తల్లోనూ మనం ఇలాంటి మాటలు విన్నాం, కథలూ చూశాం. కానీ దీన్నే నిజం చేశాడో వృద్ధుడు. 97 ఏళ్ల వయసు కల్గిన ఆయన తన చిరకాల ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే ఇతడికి పెళ్లై భార్య చనిపోగా, కొడుకు అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ వృద్ధుడు న్యాయ పోరాటం చేశాడు. చివరకు అందులో నెగ్గి తన ప్రియురాలిని ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు. జపాన్‌(Japan)కు చెందిన ఓ కెమికల్ కంపెనీ అధినేతకు ప్రస్తుతం 97 ఏళ్లు. అయితే ఈయనకు 1950లో వివాహం కాగా.. ముగ్గురు కుమారులు జన్మించారు. అయితే 1971లో తన సెక్రటరీతో ప్రేమలో పడిన ఆయన.. ఆమెతో రహస్యంగా బంధాన్ని కొనసాగించారు. భార్య మరణం తర్వాత అంటే 2016లో ఆయన తన ప్రేయసిని ఇంటికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత 50 ఏళ్లుగా ఆమెతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయన.. 2021లో ఆమెను అధికారికంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Read Also: Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!

Japan: ప్రేయసితో పెళ్లి కోసం న్యాయ పోరాటం చేసిన 97 ఏళ్ల వృద్ధుడు
Japan: ప్రేయసితో పెళ్లి కోసం న్యాయ పోరాటం చేసిన 97 ఏళ్ల వృద్ధుడు

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన కుమారుడు

తండ్రి పెళ్లి చేసుకుంటే ఆస్తి ఎక్కడ ఆ పరాయి స్త్రీ పరం అవుతుందో అని భయపడిన రెండో కుమారుడు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. “మా నాన్నకు 2017లో కింద పడటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. ఆయన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. ఆ మహిళ మా నాన్నను మాయ చేసి ఆస్తి కొట్టేయాలని చూస్తోంది” అని ఆరోపించాడు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రికి మతిస్థిమితం లేదని చెబుతున్న ఇదే కుమారుడు.. 2019లో అదే తండ్రిని కంపెనీ సీఈఓగా నియమించడానికి అంగీకరించాడు. ఈ అంశాన్ని జడ్జి శోభా నాయర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ కొడుకు వాదనలో పస లేదని తేల్చారు. కొడుకు వేసిన కేసుతో ఆగ్రహించిన ఆ 97 ఏళ్ల వృద్ధుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన వీలునామా నుంచి రెండో కుమారుడిని, అతడు కొడుకైన తన మనవడిని తొలగించడమే కాకుండా.. వారి వద్ద ఉన్న దాదాపు 3.8 మిలియన్ సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) నగదును, కంపెనీ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఎదురు దాడి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870