బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ సర్వం ఏఐ (Sarvam AI) విడుదల చేసిన Sarvam Vision మరియు Bulbul టూల్స్ ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో భారీ ఆసక్తిని రేపుతున్నాయి. ఈ టూల్స్ పనితీరు గూగుల్ జెమినీ, చాట్GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీగా మారుతోంది.
Read Also: Future Technology: క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

సర్వం ఏఐ టెక్నాలజీ వర్డ్ అక్యూరసీలో 87.3 శాతం, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR)లో 84.3 శాతం ఖచ్చితత్వం సాధించింది. అంతేకాకుండా, ఎర్రర్ రేటును కేవలం 8.6 శాతంకి పరిమితం చేయడం ద్వారా అత్యంత మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.
ఈ అద్భుత పనితీరు టెక్ నిపుణులు మరియు డెవలపర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారతదేశంలో అభివృద్ధి చేసిన ఈ ఏఐ టూల్స్ గ్లోబల్ ఏఐ మార్కెట్లో భారత్ స్థాయిని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: