ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కఠిన విధానాన్నే కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయిన మోదీ, ఉగ్రవాదంపై భారత్ వైఖరి పూర్తిగా స్పష్టమని, ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేదా రాజీ విధానానికి తావులేదని పేర్కొన్నారు.
Read Also:USA: ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఫైర్

ఈ సందర్భంగా భారత్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ప్రజల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోదీ(PM Modi) తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు కీలకంగా మారిందన్నారు.
అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భద్రత, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మలేషియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: