MBU kidnap case : తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇటీవల MBUలో ఫీజుల దోపిడీ ఆరోపణలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థి నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

ఈ కేసులో యూనివర్సిటీ పీఆర్ఓ సతీశ్‌ను ఏ1గా, హీరో మంచు విష్ణును ఏ2గా, ఆయన తండ్రి నటుడు మంచు మోహన్ బాబును ఏ3గా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే పీఆర్ఓ సతీశ్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రోత్సాహంతోనే ఈ కిడ్నాప్ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: