PAK vs NED : టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి అంచున నిలిచినప్పటికీ, నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఆఖరి దశలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పాక్‌కు చిరస్మరణీయ గెలుపును అందించింది.
148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47) దూకుడైన ఆరంభం అందించాడు. అయితే, మధ్య ఓవర్లలో నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరగా, పాకిస్థాన్ ఓటమి ముంగిట నిలిచింది.
Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమైన కీలక దశలో ఫహీమ్ అష్రాఫ్ ఒంటరిగా పోరాడాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు సాధించి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశాడు. చివరి ఓవర్లో మరో బౌండరీతో జట్టుకు విజయం ఖాయం చేశాడు. ఫహీమ్ కేవలం 11 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్ బౌలర్లు 147 పరుగులకే కట్టడి చేశారు. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37), బాస్ డి లీడె (30) మాత్రమే పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: