Bandi sanjay : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌లో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ ఎప్పుడైనా గళం విప్పారా అని ప్రశ్నించారు.
ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా లేదా అన్న అంశంపై ఓవైసీ దమ్ముంటే స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పట్టణాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీజేపీ అభ్యర్థులు గుణవంతులని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధనవంతులని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా 20 సీట్లకు మించి గెలవలేరని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: