T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో West Indies భారీ స్కోర్ నమోదు చేసింది. స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ Shimron Hetmyer అద్భుత అర్ధశతకంతో రాణించడంతో, వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దీంతో స్కాట్లాండ్‌కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచిన Scotland బౌలింగ్ ఎంచుకోగా, వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35), షాయ్ హోప్ (19) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత హెట్మెయర్ బరిలోకి దిగి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి స్కోరు వేగంగా పెంచాడు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

హెట్మెయర్‌కు రోవ్‌మన్ పావెల్ (24), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (26) మంచి సహకారం అందించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ కర్రీ ఆకట్టుకునే బౌలింగ్‌తో 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్, డేవిడ్‌సన్ తలో వికెట్ పడగొట్టారు.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. తాజా సమాచారం ప్రకారం, 2.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 19 పరుగులతో ఉంది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మైఖేల్ జోన్స్ (1) ఔటయ్యాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: