మన నిత్య జీవితంలో ఓలా(Ola), ఉబర్, రాపిడో వంటి యాప్‌లు భాగమైపోయాయి. ఆఫీసుకెళ్లాలన్నా, అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంటనే మొబైల్ తీసి రైడ్ బుక్ చేసుకుంటాం. అయితే, మనకు సేవలు అందించే ఈ గిగ్ వర్కర్లు (Gig Workers) ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7వ తేదీ.. శనివారం నాడు దేశవ్యాప్త నిరసనకు సిద్ధమయ్యారు. దీనిని ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ (All India Breakdown) అని పిలుస్తున్నారు. నిరసన ఎందుకు? ప్రధాన డిమాండ్లు ఏమిటి? తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తో పాటు ఇండియన్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్ వంటి అనేక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వీరి ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. అగ్రిగేటర్ సంస్థలు (Ola, Uber, Rapido) ఛార్జీలను తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయిస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్’ అమలులో ఉన్నప్పటికీ.. సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని యూనియన్ నేతలు అంటున్నారు.
Read Also: Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు

గిగ్ ఎకానమీలో పెరుగుతున్న సవాళ్లు
కనీస బేస్ ఫేర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సొంత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలను (White Plate) కమర్షియల్ పనుల కోసం వాడటాన్ని కఠినంగా అరికట్టాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 2, సోమవారం ధరలు ఇవే.. ఆరు గంటల పాటు నిలిచిపోనున్న సేవలు ఈ నిరసనలో భాగంగా ఫిబ్రవరి 7న సుమారు ఆరు గంటల పాటు గిగ్ వర్కర్లు తమ యాప్‌లను ఆఫ్ చేసి, రోడ్లపైకి రాకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విమానాశ్రయాలకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి రావచ్చు. గిగ్ ఎకానమీలో పెరుగుతున్న సవాళ్లు భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య ఏటికేడూ భారీగా పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం, డిజిటల్ పేమెంట్స్ సులభతరం కావడంతో ఈ రంగం వేగంగా విస్తరించింది. అయితే విస్తరణ జరుగుతున్నా వారి ఆదాయాల్లో మాత్రం స్థిరత్వం లేదు. ఆర్థిక సర్వే ప్రకారం.. దాదాపు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడంతో వారి చేతికి మిగిలేది చాలా తక్కువగా ఉంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: