हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం

Rajitha
YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం

గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడిన మాజీ సిఎం జగన్

గుంటూరు : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం అంబటి రాంబాబు నివాసానికి గుంటూరు వచ్చారు. సాయంత్రం అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న వైయస్ జగన్ ముందుగా ఇంటిని ఆఫీసును పరిశీలించారు. ఆ తరువాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధర్య పడొద్దు, పార్టీ అండగా ఉంటుందని భరోసాను వారికి ఇచ్చారు. తదుపరి మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు పై జరిగిన దాడి పై విరుచుకుపడ్డారు. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కాపు కులానికి టైగర్ అలాంటి వ్యక్తిని స్టేషన్ లో నల్లపాడు, పట్టాభిపురం సిఐలు దారుణంగా కొట్టారని వైయస్ జగన్ అన్నారు.

Read also: Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స

ur government will be the one coming to power.

ur government will be the one coming to power.

జగన్ రాక నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో

వచ్చేది తమ ప్రభుత్వం అన్నిటి పై ఎంక్వైరీ వేస్తాం వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నీ లెక్కలు తేలుస్తాం విషపూరిత విత్తనాలు నాటడo ఆపండి రేపు కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించుకోమని అన్నారు. చేతనైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిస్తాం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 200 మంది. సీఐలు ఎస్సైలు వి ఆర్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కావలసిన వారిని పోలీసులు నియమించుకున్నారు. బీహార్ సంగతేమో గాని ఏపీలో మాత్రం జంగల్ రాజ్ నడుస్తుంది తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం అని వైయస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ రాక నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలివచ్చారు. గుంటూరు విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టి

దీంతో కనీసం అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పోయింది. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గతంలో వల్నాడు. నెల్లూరు జిల్లాల్లో జగన్ పర్యటనల సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోలీసు ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జాతీయ రహదారిపై వైసీపీ నేతల వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. గుంటూరులో జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టి, పలువురు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వైసీపీ కేడర్ తరలివెళ్తుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జనజీవనానికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పని

సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు పోలీసు అధికారులను కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. గుంటూరుజిల్లా పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడా బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని జిల్లాపోలీసు యంత్రాంగం ప్రకటన జారీ చేసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినా, సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పని గుంటూరు పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870