షాదీ డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు(Online Fraud) యువతులను మోసం చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు నేరస్తులకు అవకాశాలు కల్పిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. యానాం ఎమ్మెల్యే ఫోటోను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురు యువతులను మోసగించిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also:UP: ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రూ.11 లక్షల మోసం.. పలువురు బాధితులు
రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్ష అనే వ్యక్తి, తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక వైద్యురాలిని రూ.11 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో మరికొంతమంది యువతులు కూడా ఫిర్యాదులు(Online Fraud) చేయడంతో, నిందితుడితో పాటు షాదీ డాట్‌కామ్ డైరెక్టర్, టీమ్ లీడర్, మేనేజర్లు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి.
హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆదేశాలు
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ షాదీ డాట్‌కామ్ నిర్వాహకులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం ఈ కేసును మరోసారి పునఃసమీక్షించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ అంశంపై న్యాయపరమైన చర్చ మరింత విస్తరించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: