సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సిఎస్ రామకృష్ణారావు సమీక్ష
Telangana Funds : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు(K. Rama Krishna Rao) పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని అన్నారు.
Read Also:Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన

కేంద్ర ప్రభుత్వ సి.ఎస్.ఎస్ క్రింద ఐదు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతి పాదించిందని, దీనిలో భాగంగా 15 శాతం జనాభా ఉన్న తెలంగాణాకు కనీసం రూ 25 వేలకోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసారు. ఈ కేంద్ర బడ్జెట్లో ఫార్మా, రంగ అభివృద్ధి, సెమి కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చారని, ఈదిశగా తగు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. ఖమ్మం, వరంగల్ కరీంనగర్ జిల్లాను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి అవకాశం ఉందని, దీనిలో భాగంగా వరంగల్లో మామునూరు ఎయిర్ పోర్ట్ కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి గణనీయమైన అవకాశం ఉందని అన్నారు.
16వ ఆర్థిక సంఘం సిఫార్సులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో పది వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. 16 ఆర్థిక కమీషన్ లోభాగంగా 2011 జనాభా ప్రాతిపదికపై నిధుల మంజూరు ఉంటుందని, దీనితో పాటు డెమోగ్రాఫిక్ ఏరియా, పధకాల అమలు సామర్థం, నిధుల వినియోగం లాంటి ప్రాతిపదికలపై కూడా నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు.
ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదిక ప్రకారం నిధుల కేటాయింపుకు ప్రాధాన్య నిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో వినియోగం కాకుండా ఉన్న మిగులు నిధులను రాష్ట్రానికి దక్కేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వి. ఆనంద్, వికాస్ రాజ్, సంజయ్ కుమార్, జయేష్ రంజన్, సవ్య సాచి ఘోష్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్.శ్రీధర్ వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: