हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Telangana: ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన

Tejaswini Y
Telangana: ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: బల్మూరి వెంకట్

Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని వివరించారు.

Read Also:Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన

Telangana: CM Revanth Reddy to make big announcement on jobs soon
Telangana: CM Revanth Reddy to make big announcement on jobs soon

బీఆర్ఎస్ వైఫల్యాలపై ధ్వజం

నోటిఫికేషన్స్ ఇస్తే కొలువు వస్తుందనే భరోసా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు కల్పించామని చెప్పారు. మంగళవారం నాడు నాంపల్లిలోని గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేటీఆర్(KTR) 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో సరకులు అమ్మినట్టు అమ్మారని విమర్శించారు. 10 ఏళ్లలో నిరుద్యోగులను బాధపెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులపై వెంకట్ మండిపడ్డారు. వాళ్లకి చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో అమ్ముకున్న ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్, కేటీఆర్ గడీ కాదన్నారు. తాజాగా టీజీపీఎస్సీ వన్ టైమ్ పాస్వర్డ్ రిజిస్ట్రార్లు ప్రాసెస్ చేస్తుందని వివరించారు. పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తామని పేర్కొన్నారు.
ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ ప్రకటన చేస్తారని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మకండంటూ యువతకు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హితవు పలికారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870