ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ (Telangana) ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. భక్తుల రాకపోకలతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడగా, మొత్తం మీద రూ.3.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏటా జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ఆర్టీసీ విస్తృత స్థాయిలో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. మేడారం జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖమ్మం, ఇల్లెందు,
Read Also: Jagtial: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

కోటికి పైగా ఆదాయం
ఏటూరినాగారం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, మంగపేట ప్రాంతాల నుంచి మొత్తం 214 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా సుమారు రెండు లక్షల మంది భక్తులు మేడారానికి సురక్షితంగా రాకపోకలు సాగించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా సర్వీసులు నిర్వహించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.. ముఖ్యంగా కొత్తగూడెం డిపో నుంచి 90 బస్సుల ద్వారా 45,431 మందిని తరలించగా, రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: