हिन्दी | Epaper

Shinganamala crime: భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య

Tejaswini Y
Shinganamala crime: భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య

Shinganamala crime : అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామంలో భూ తగాదాలలో సోమవారం రాత్రి తల్లికొడుకులను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తరిమెల గ్రామానికి చెందిన నల్లప్పకి ఇద్దరు భార్యలు. కొద్ది సంవత్సరాల క్రితం నల్లప్ప చనిపోవడం తో రెండు కుటుంబాల మధ్య భూ తగాదలు మొదలయ్యాయి.

Read Also: Accident : జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Shinganamala crime: Mother and son brutally murdered over land dispute
Shinganamala crime: Mother and son brutally murdered over land dispute

ఇందులో భాగంగా రెండవ భార్య యల్లమ్మ(38) అంగన్వాడి టీచర్, ఆమె కొడుకు చిన్న(22) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. పోలీసులు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

కుమారుడిని బండరాయితో కొట్టి..

ప్రాథమిక సమాచారం మేరకు గత కొంత కాలంగా ఆస్తికి సంబంధించిన వివాదాలు వారి కుటుంబ సభ్యుల మద్య కొనసాగుతున్నట్లు తెలిసింది. గ్రామస్తుల వివరాల మేరకు హత్యకు గురైన యల్లమ్మను వెంటాడి తలనరికి కాలనీలో తిప్పడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఆమె కుమారుడు చిన్నను సైతం నరికి, తలపై బండరాయి వేసి హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక బృందంచే దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870