हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

West Godavari: ఎసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు

Saritha
West Godavari: ఎసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన తణుకు పట్టణం లో సంచలనంగా మారింది. కేసు పరిష్కారం పేరుతో బాధితుడిని భయపెట్టి మొత్తం రూ.25,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో మెరుపు దాడి చేసి, లంచం స్వీకరి స్తున్న సమయంలో సుబ్బారావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం సుబ్బారావును ఏసీబీ అధికా రులు విచారిస్తూ, కేసుకు సంబంధించిన మరిన్ని వివ రాలు సేకరిస్తున్నారు.

Read Also: Amaravati Capital: పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా రూ.3,320 కోట్లు..

West Godavari: ఎసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు
Head Constable Subbarao caught by the ACB.

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ 2025 సంవత్సరంలో బాధితులు జక్కంశెట్టి మావుళ్లేశ్వరరావు ఉద్యోగం ఇప్పిస్తానని తమను మోసం చేసినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తణుకు పట్టణ సీఐ కొండయ్య నిందితుడు మావుల్లేశ్వర రావు కేసును క్రిమినల్ కేసుగా మారుస్తానని చెప్పినట్లు తనతో (West Godavari) హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు బెదిరించినట్లు బాధితుడు మావుళ్ళేశ్వరరావు తెలిపాడన్నారు.

చీటింగ్ కేసు తీసివేయడానికి, క్రిమినల్ కేసు పెట్టకుండా ఉండ డానికి సిఐకి ఇవ్వాలని హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తనను 30,000 లంచం అడిగారని, చర్చల ద్వారా 25 వేలకు కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు డిఎస్పి వివరించారు. సీఐ కొండయ్యని కూడా ప్రశ్నిస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870