हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

Vanipushpa
Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు కోర్ట్ ఆఫ్​ ఆర్బిట్రేషన్ తెలిపిన వేళ, భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విచారణలో తాము పాల్గొనబోమని స్పష్టం చేసింది. భారత్‌- పాకిస్థాన్‌ సింధు జలాల ఒప్పందానికి (IWT) సంబంధించి కొత్త విచారణలు, ఆదేశాలతో హేగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్ట్‌ (COA) ముందుకు సాగుతున్న వేళ, ఈ విచారణల చట్టబద్ధతను గుర్తించబోమని భారత్‌ తేల్చిచెప్పింది. జల విద్యుత్ కేంద్రాల కార్యాచరణ పాండేజ్ లాగ్‌బుక్‌లను సమర్పించాలని వారం క్రితం COA భారత్‌కు తెలిపింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. భారత్‌ ఇంతవరకు ఎలాంటి ప్రతివాద నివేదికను దాఖలు చేయలేదని పేర్కొంది.

Read Also: SCR: 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌
Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

భారత్​ నిర్ణయం పట్ల పాకిస్థాన్ ఆందోళన

అయితే, COA వ్యాఖ్యలపై భారత్‌ మండిపడింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన COA, అసంబద్ధమైన విచారణలను కొనసాగిస్తోందని పేర్కొంది. CoA చట్టబద్ధతను తాము గుర్తించనందున, దాని ఆదేశాలపై స్పందించబోమని తేల్చిచెప్పింది. అదనంగా I.W.Tని నిలిపివేసినందున భారత్‌ స్పందించాల్సిన అవసరమే లేదని స్పష్టంచేసింది. మరోవైపు సింధూ(Indus) జలాల ఒప్పందం (IWT) విషయంలో భారత్​ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్​. ఈ ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన సరిహద్దుల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మా ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన సరిహద్దు సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నదీ ప్రవాహాల అంతరాయం సింధు బేసిన్‌పై ఆధారపడిన దేశంలో లక్షలాది మంది జీవితాలు, జీవనోపాధి, ఆహార వ్యవస్థలను దెబ్బతీస్తుంది.” అని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్​కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్. పాకిస్థాన్‌కు జలాలను తరలించే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని వెల్లడించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870